బిగ్‌బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజులో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకొచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 49 హైలైట్స్‌లో చూద్దాం.
దసరా స్పెషల్
తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతోంది. బిగ్‌బాస్ హౌసులోనూ పండగ సరదాతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫుల్ కలర్‌ఫుల్‌గా రెడీ అయి వచ్చిన నాగార్జున.. హౌస్‌మేట్స్‌కి దసరా శుభాకాంక్షలు చెప్పాడు. దసరా(DASARA)లో ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆరు గేమ్స్ పెడతానని, వీటిలో గెలిచినవాళ్లకి సర్‌ప్రైజులు ఉంటాయని చెప్పాడు. ఈ పోటీల్లో ఇరుజట్లు చెరో మూడింట్లో గెలిచి సమంగా నిలిచాయి.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' గౌతమ్ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
ఫస్ట్ టైమ్ ఏడ్చిన శోభా, యవర్
బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత శోభా, యవర్ పెద్దగా ఏడవడం ఎవరూ చూడలేదు. వీళ్లు అలా స్ట్రాంగ్‌గా ఉండి ఆడుతున్నారు. ఆదివారం పెట్టిన గేమ్స్‌లో గెలిచిన తర్వాత ఇంటి నుంచి వీళ్లకు లెటర్స్ వచ్చాయి. తమ ఇంటి సభ్యులు తమ గురించి రాయడం, వాటిని వీళ్లు చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది. నామినేషన్స్ నుంచి సేవ్ అయినప్పుడు తేజ కూడా నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అందరినీ ఎంటర్‌టైన్ చేసే వీళ్లు ఎమోషనల్ కావడం డిఫరెంట్‌గా అనిపించింది.
పూజా ఎలిమినేట్
దసరా ఎపిసోడ్‌లో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్‌పుత్.. డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. యంగ్ సింగర్స్ వాగ్దేవి, లాలస, శిరీష పాటలతో అలరించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అమరదీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్ వరసగా సేవ్ అయ్యారు. పండగ కాబట్టి ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులే వచ్చి సేవ్ అయినట్లు చెప్పుకొచ్చారు. పూజా, భోలె మిగలగా.. పూజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరోవైపు ఈవారం ఓ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఉంటుందన్నారు. అలా రతిక.. బిగ్‌బాస్‌లోకి తిరిగి అడుగుపెట్టింది.
(ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!)
ప్రేక్షకులు మోసపోయారా?
బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని హౌస్ట్ నాగార్జున పదే పదే చెబుతుంటాడు. అలాంటిది రతిక ఆట బాగోలేదనే కదా.. ఆమెని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. కానీ నిర్వహకులికి మాత్రం ఆమెని తిరిగి ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్. మరీ నేరుగా తీసుకొచ్చేస్తే షో క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి దామిని, శుభశ్రీ, రతికలో ఒకరిని ఛాన్స్ ఉంటుందని కలరింగ్ ఇచ్చారు. బిగ్‌బాస్ సభ్యుల ఓట్ల ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు.
తీరా చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకి కాకుండా తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు రీఎంట్రీ ఇస్తారని నాగార్జున అన్నాడు. దీంతో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోయింది. రతికని తీసుకురావడానికే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తంగా చూస్తే రతిక రీఎంట్రీ కోసం బిగ్‌బాస్ ఆర్గనైజర్స్.. ఓట్లేసిన ప్రేక్షకుల్ని నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారనిపించింది.
ఈ వారం పూజాని ఎలిమినేట్ చేసేశారు. బిగ్‌బాస్ ప్రస్తుతం సీజన్‌లో వరసగా వెళ్లిపోయిన ఏడో లేడీ కంటెస్టెంట్ ఈమె. అయితే ఏ సీజన్‌లోనూ జరగనంతా విచిత్రంగా ఈసారి ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. అసలు ఏం చేస్తున్నారో? ఏ లాజిక్ ప్రకారం వరసగా లేడీ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి వల్ల బిగ్‌బాస్ చూస్తున్న ఆ కొద్దిమంది కూడా ఓట్లేసినందుకు నవ్వుకుంటున్నారు!
(ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment