బిగ్‌బాస్ సీజన్-7 ఐదోవారం ఇప్పటికే ముగిసింది. ఈ షో నుంచి ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారంలో శుభశ్రీ రాయగురు హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే బిగ్ బాస్ షోతో తెలుగువారికి పరిచయమైన శుభశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అయితే బిగ్‌బాస్‌కు రాకముందే సినిమాల్లోనూ నటించింది. ఈ ఏడాది నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన అమిగోస్‌తో పాటు కథ వెనుక కథ, రుద్రవీణ చిత్రాల్లో కనిపించింది. అంతేకాకుండా ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీలోనూ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
చూడడానికి తెలుగమ్మాయిలా కనిపించే శుభశ్రీ ఒడిషా రాష్ట్రంలో జన్మించింది. ఆమె ఫ్యామిలీకి ఒడిషాకు చెందినవారే. అయినప్పటికీ తెలుగులోనూ గలగల మాట్లాడేస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చేముందు తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
(ఇది చదవండి: లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!)
శుభశ్రీ మాట్లాడుతూ.. 'తాను తెలుగు మొదట బాగా వచ్చేది కాదు. కానీ తర్వాత నేర్చుకున్నా. ఎల్‌ఎల్‌బీ చదివాను. ఇండస్ట్రీలోకి వచ్చాక క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకు ఎదురవ్వలేదు. అయితే ఈవెంట్స్‌లో కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి చూశారు. 2020లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచా. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు బాగా పాపులారిటీ దక్కించుకుంది. కమర్షియల్ సినిమాలు బాగా వస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు వచ్చింది. తెలుగు హీరోల్లో అవకాశమొస్తే విజయ్ దేవరకొండతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది. హీరోల్లో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అంటే ఇష్టం. నాకు కొంచెం సిగ్గు కూడా చాలా ఎక్కువ. కానీ తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరని మాత్రం' చెప్పుకొచ్చింది.
తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీ అంతా లాయర్స్. నాన్నగారు జడ్జిగా పనిచేస్తున్నారు. నాకు ఒక అక్క, తమ్ముడు. అక్కా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తమ్ముడు లా చదువుతున్నాడు.' అని తెలిపింది. అయితే బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్న శుభ శ్రీ తెలుగు అమ్మాయి కాకపోయినా చాలా చక్కగా తెలుగులో మాట్లాడి అభిమానులను అలరించింది.
(ఇది చదవండి: కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్‌రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత!)
Comments
Please login to add a commentAdd a comment