
విద్యార్థిని సందేహాలు నివృత్తి చేస్తున్న కలెక్టర్ గౌతమ్
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి తొలిమెట్టు కార్యక్రమం అమలుపై ఆరా తీశాక విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పలువురు విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడంతో పాటు కొన్ని పాఠ్యాంశాల్లోని సందేహాలను నివృత్తి చేశారు.
సమాధానాలు సరిగ్గా చెప్పిన వారిని అభినందించడంతో విద్యార్థులు ఉప్పొంగిపోయారు. అనంతరం స్థానిక జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో మన ఊరు–మన బడి కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఈవో యాదయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment