Kajal Aggarwal Baby Shower Photos Viral: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కాజల్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్‌గానే కాజల్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment