ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం | Bhai Dooj Celebrating in Mahesh Babu Home Photos Viral | Sakshi

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

Oct 31 2019 9:50 AM | Updated on Oct 31 2019 11:41 AM

Bhai Dooj Celebrating in Mahesh Babu Home Photos Viral - Sakshi

అన్న గౌతమ్‌కు బొట్టు పెడుతున్న సితార

బంజారాహిల్స్‌: కార్తీకమాసంలో ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ‘బాయిదూజ్‌’ వేడుక ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించింది. ఈ పండగ రోజు అక్క,చెల్లెళ్లు తమ సోదరులకు హారతి ఇచ్చి నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని పూజలు చేస్తారు. అంతేకాదు ఆ రోజు తమ సోదరులకు బహుమతులు కూడా ఇస్తారు. రాఖీ పండుగ తరహాలో జరిగే ఈ వేడుక బుధవారం టాలీవుడ్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌బాబు ఇంట్లో చేసుకున్నారు. కూతురు సితార తన అన్న గౌతంకృష్ణకు నుదుటున బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. ఈ సెలబ్రేషన్స్‌ ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వీటిని చూసిన ప్రిన్స్‌ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement