Bhai Dooj
-
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
ప్రిన్స్ ఇంట ‘బాయిదూజ్’ సంబరం
బంజారాహిల్స్: కార్తీకమాసంలో ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ‘బాయిదూజ్’ వేడుక ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించింది. ఈ పండగ రోజు అక్క,చెల్లెళ్లు తమ సోదరులకు హారతి ఇచ్చి నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని పూజలు చేస్తారు. అంతేకాదు ఆ రోజు తమ సోదరులకు బహుమతులు కూడా ఇస్తారు. రాఖీ పండుగ తరహాలో జరిగే ఈ వేడుక బుధవారం టాలీవుడ్ హీరో, ప్రిన్స్ మహేష్‌బాబు ఇంట్లో చేసుకున్నారు. కూతురు సితార తన అన్న గౌతంకృష్ణకు నుదుటున బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను నమ్రతా శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వీటిని చూసిన ప్రిన్స్ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. View this post on Instagram Bhau beez😍😍this yearly tradition when Sitara is looking to make some money to buy extra robux for a strange game these kids play these days 😘😘😘and parallelly hoping that her brother will always stand strong behind her like a rock ❤️❤️on the other hand her brother is hoping this little celebration gets over quickly so he can change back into his pyjamas 🤣🤣🤣🤣 I love my kids😘😘#myworld #bhaubeez #grateful ❤️❤️happy Diwali everyone and a happy new year 🤗🤗 @anoushkaranjit we missed u my sweetie 😘😘😘 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Oct 29, 2019 at 6:56am PDT -
లవ్ యూ రాహుల్: ప్రియాంక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ భాయ్ దూజ్((భగినీ హస్త భోజనం) పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్‌లో అమర్చి ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫ్రేమ్‌లో నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె ట్వీట్ చేశారు. వీటికి ‘లవ్ యూ రాహుల్‌గాంధీ.. భాయ్‌దూజ్’ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్ రోజు సైతం ప్రియాంకా.. రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్ దూజ్ వేడుక. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే ఈ వేడుక సందర్భంగా సోదర, సోదరీవమణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చిపుచ్చకోవడం అనవాయితీ. కాగా సినీ ఇండస్ట్రీలో సైతం సెలబ్రిటీలు ఈ బాయ్ దూజ్ వేడుకలను నిర్వహించుకొని వారి సోదరిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. love you @RahulGandhi ❤❤❤❤#भाईदूज pic.twitter.com/GxR4Og4P4d — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2019 -
టెర్రస్‌పై గబ్బర్ ధూమ్‌ధామ్
-
టెర్రస్‌పై గబ్బర్ ధూంధాం
న్యూఢిల్లీ: నిత్యం క్రికెట్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లతో బిజీగా ఉండే టీమిండియా క్రికెటర్లకు చిన్న విరామం దొరకడంతో ప్రస్తుతం సేద తీరుతున్నారు. ఈ గ్యాప్‌లో వచ్చిన దీపావళి పండుగను కుటుంబసభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కుటుంబసభ్యులతో కలిసి చేసిన ఎంజాయ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేరాడు. శిఖర్ ధావన్ ఇంటాబయటా చేసే వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో అభిమానులను ఉత్సాహపరచడానికి స్టెప్పులేయడం.. అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్‌లో, ట్రావెలింగ్‌లో సహచర ఆటగాళ్లతో కామెడీ పండించడం చూస్తుంటాం. ముఖ్యంగా తన పిల్లలతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ధావన్ పంచుకుంటాడు. తాజాగా భాయ్ దూజ్ వేడుక సందర్భంగా తన కుటంబసభ్యులతో కలిసి సందడి చేశాడు. అదేవిధంగా ఇంటి టెర్రస్‌పై క్రికెట్ ఆడుతూ ధూమ్‌ధామ్ చేశాడు. వీటికి సంబంధించిన ఫోటోలను, వీడియోను షేర్ చేస్తూ తన పండుగ అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి చాలా సరదాగా గడిపాను. ఇలాంటి క్షణాలు నన్ను ఎప్పటికీ ఉత్సాహపరుస్తాయి. అందరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు’, అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన కుటంబ సభ్యులతో ఇంటి టెర్రస్‌పై క్రికెట్ ఆడిన వీడియోను కూడా ధావన్ షేర్ చేశాడు. కుటుంబ సభ్యులు ఫీల్డింగ్ చేస్తుంటే.. ధావన్ బ్యాటింగ్ చేశాడు. ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడిన ధావన్.. అర్దంతరంగా ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే గాయం నుంచి కోలుకొని వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిని టీ20 సిరీలో 76 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహపరిచాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ధావన్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నవంబర్ 3 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ(కోట్లా)మైదానం వేదికగా బంగ్లా-భారత్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది. -
ఘనంగా భాయ్ దూజ్
దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలిచే భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన అన్నయ్యలకు చెల్లెళ్లు, అక్కలు వారికి ఇష్టమైన వంటకాలు చేసి ఆతిథ్యమిచ్చారు. ఇక సోదరులు తమవంతుగా వారికి కానుకలను అందజేశారు. న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఐదురోజులపాటు జరిగే దీపావళి పండుగ చివరిరోజున జరుపుకునే ఈ పండుగ సందర్భంగా చెల్లెళ్లు తమ సోదరుల ముఖాలపై సింధూరం రాసి కలకాలం ఆనందంగా జీవించాలంటూ ప్రార్థిస్తారు. ఇందుకు బదులుగా అన్నలు తమ చెల్లెళ్లకు కానుకలను అందజేస్తారు. అనంతరం వారికి ఆతిథ్యమిస్తారు. పసందైన భోజనం పెడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. భాయ్ టికా, భాయ్ ఫోటా, భాయ్ భీజ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నా: భాయ్‌దూజ్ పండుగను ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నానని నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన ప్రియదర్శినీసింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా సోదరుడు కెనడాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది ఈ పండుగకు వచ్చాడు. వస్తూ వస్తూ నాకోసం అనేక కానుకలు కొనుగోలు చేశాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అంది. మా అన్నయ్యకు ఖీర్ తినిపించా: ఈ పండుగ కోసం ప్రతిరోజూ కంటే ముందుగానే మేలుకున్నా. అన్నయ్యకి ఖీర్ అంటే ఎంతో ఇష్టం. అందుకని అదే చేసి తినిపించా’అని నగరానికి చెందిన మరో యువతి స్వేచ్ఛాశర్మ ఆనందంగా తెలిపింది. ఎన్నో పురాణ గాధలు: కాగా భాయ్‌దూజ్ పండుగకు సంబంధించి అనేక పురాణ గాధలు ఉన్నాయి. అందులో ఓ కథను ముందుగా చెప్పుకుందాం. యముడు ఓ రోజు తన సోదరి నివాసానికి వెళతాడు. అన్నయ్య రాకను గమనించి మురిసిపోయిన సోదరి అతని నుదుట సింధూరం దిద్దుతుంది. అంతేకాకుండా అన్నయ్య కలకాలం జీవించాలంటూ ప్రార్థనలు చేస్తుంది. ఇప్పుడు మరో కథకు వద్దాం. నరకాసురుడిని చంపిన అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి శ్రీకృష్ణుడు వెళతాడు. సుభద్ర తన అన ్నయ్య నుదుటిన సింధూరం దిద్ది ఘనస్వాగతం పలుకుతుంది.