దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలిచే భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన అన్నయ్యలకు చెల్లెళ్లు, అక్కలు వారికి ఇష్టమైన వంటకాలు చేసి ఆతిథ్యమిచ్చారు. ఇక సోదరులు తమవంతుగా వారికి కానుకలను అందజేశారు.
న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఐదురోజులపాటు జరిగే దీపావళి పండుగ చివరిరోజున జరుపుకునే ఈ పండుగ సందర్భంగా చెల్లెళ్లు తమ సోదరుల ముఖాలపై సింధూరం రాసి కలకాలం ఆనందంగా జీవించాలంటూ ప్రార్థిస్తారు. ఇందుకు బదులుగా అన్నలు తమ చెల్లెళ్లకు కానుకలను అందజేస్తారు. అనంతరం వారికి ఆతిథ్యమిస్తారు. పసందైన భోజనం పెడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. భాయ్ టికా, భాయ్ ఫోటా, భాయ్ భీజ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నా: భాయ్‌దూజ్ పండుగను ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నానని నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన ప్రియదర్శినీసింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా సోదరుడు కెనడాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది ఈ పండుగకు వచ్చాడు. వస్తూ వస్తూ నాకోసం అనేక కానుకలు కొనుగోలు చేశాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అంది.
మా అన్నయ్యకు ఖీర్ తినిపించా: ఈ పండుగ కోసం ప్రతిరోజూ కంటే ముందుగానే మేలుకున్నా. అన్నయ్యకి ఖీర్ అంటే ఎంతో ఇష్టం. అందుకని అదే చేసి తినిపించా’అని నగరానికి చెందిన మరో యువతి స్వేచ్ఛాశర్మ ఆనందంగా తెలిపింది. ఎన్నో పురాణ గాధలు: కాగా భాయ్‌దూజ్ పండుగకు సంబంధించి అనేక పురాణ గాధలు ఉన్నాయి. అందులో ఓ కథను ముందుగా చెప్పుకుందాం. యముడు ఓ రోజు తన సోదరి నివాసానికి వెళతాడు. అన్నయ్య రాకను గమనించి మురిసిపోయిన సోదరి అతని నుదుట సింధూరం దిద్దుతుంది. అంతేకాకుండా అన్నయ్య కలకాలం జీవించాలంటూ ప్రార్థనలు చేస్తుంది. ఇప్పుడు మరో కథకు వద్దాం. నరకాసురుడిని చంపిన అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి శ్రీకృష్ణుడు వెళతాడు. సుభద్ర తన అన ్నయ్య నుదుటిన సింధూరం దిద్ది ఘనస్వాగతం పలుకుతుంది.
ఘనంగా భాయ్ దూజ్
Published Sat, Oct 25 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement