
గౌతమ్, మహేశ్‌బాబు
‘గడుపుతున్న క్షణాలను ఆనందంగా జీవిస్తేనే అవి గడిచాక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి’ అంటున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం మహేశ్ తన కుటుంబంతో కలసి దుబాయ్‌లో హాలిడే చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడం కోసం ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌తో పాటు దుబాయ్ వెళ్లారు. కుటుంబంతో కలసి గడుపుతున్న ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నమ్రత. ‘‘నా బెస్ట్ బడ్డీతో (బెస్ట్ ఫ్రెండ్) మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నాను’’ క్యాప్షన్ చేస్తూ తనయుడు గౌతమ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు మహేశ్. కుమారుడిని బెస్ట్ బడ్డీ అని సంబోధించడం చూస్తుంటే వీళ్లిద్దరూ తండ్రీ కొడుకల్లా కంటే ఫ్రెండ్స్ లా ఉంటారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment