Mahesh Babu Going To Dubai For New Year Celebrations: కొత్త సంవత్సరానికి దుబాయ్‌లో ఆహ్వానం పలకనున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం మహేశ్ స్పెయిన్‌లో ఉన్నారు. అట్నుంచి దుబాయ్ వెళతారు. మహేశ్ అక్కడికి చేరుకునే సమయానికి ఆయన భార్యా పిల్లలు నమ్రత, గౌతమ్, సితార కూడా దుబాయ్ వెళతారు. ప్రతి ఏడాదీ ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళుతుంటారు మహేశ్. ఈ సంవత్సరాంతంలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారాయన. మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది.
కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని దుబాయ్ వెళతారు. కాగా, మోకాలికి జరిగిన సర్జరీ చాలా చాలా చిన్నదని నమ్రత వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే మహేశ్ కాలిగాయం ఇప్పటిది కాదు. 2017లో ‘స్పైడర్’ చిత్రీకరణ అప్పుడు ఆ షూటింగ్‌లో గాయపడ్డారట. ఆ గాయమే ఇటీవల ‘సర్కారువారి పాట’ సాంగ్ షూట్‌లో తిరగబెట్టిందట. పెద్దగా విశ్రాంతి అవసరం లేని చిన్న సర్జరీ కాబట్టి చేయించేసుకున్నారని సమాచారం.
ఇక గౌతమ్, సితార పరీక్షలు మరో వారంలో పూర్తవుతాయట. ఆ తర్వాత పిల్లలతో సహా నమ్రత దుబాయ్ వెళతారు. వెకేషన్ ఎంజాయ్ చేసి, వచ్చే జనవరి మొదటి వారంలో హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. ఆ తర్వాత మహేశ్ ‘సర్కారువారి పాట’ షూట్‌లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment