గుంటూరు కలెక్టరేట్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి పెట్రోల్ బంక్ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.