సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన బైక్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బైకు మంటల్లో దగ్ధం అయ్యింది. అప్రమత్తమైన బంకు సిబ్బంది నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పెట్రోల్ బంకులో ఫైర్ సేప్టీ ప్రమాణాలు సరిగా లేవని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు.