అనంతపురం అర్బన్ : ఈ నెల 26న ఏపీపీఎస్సీ గ్రూప్ - 2 పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. అధికారులకుగానీ, అభ్యర్థులకుగానీ ఏవైనా సందేహాలుంటే 84980 98220 నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో డీఆర్వో సి.మల్లీశ్వరిదేవితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. అందులో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి రామనాథం శెట్టి, పర్యవేక్షకులు వరదరాజులు పాల్గొన్నారు.
హాల్‌టికెట్లు రానివారు నామినల్ రోల్స్ పరిశీలించుకోవచ్చు
గ్రూపు - 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ హాల్ టికెట్ రాని అభ్యర్థులు కలెక్టరేట్‌లో నామినల్ రోల్స్ పరిశీలించుకోవచ్చని జేసీ తెలిపారు. శనివారం సాయంత్రంలోగా వీటిని చూసుకోవచ్చన్నారు. నామినల్ రోల్స్‌లో పేరు ఉంటే ఏదేని ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే పరీక్ష రాయడానికి అధికారులు సెంటర్‌ను కేటాయిస్తారన్నారు.
గ్రూపు - 2 పరీక్షల సందర్భంగా.. కంట్రోల్ రూం
Published Fri, Feb 24 2017 9:41 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement