హెచ్పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు | Control Room set up for the victims of HPCL | Sakshi
Sakshi News home page

హెచ్పీసీఎల్ బాధితుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

Published Sat, Aug 24 2013 10:30 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం సందర్శించారు.

నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ శనివారం  సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. హెచ్పీసీఎల్ ప్రమాద ఘటన వివరాలకు సంబంధించి విశాఖపట్నంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఆ ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్180042500002 ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య శనివారం ఉదయానికి నాలుగుకు చేరింది. అయితే ఆ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement