ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు | Control Room setup in Adilabad collectorate | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు

Published Mon, Sep 8 2014 8:38 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Control Room setup in Adilabad collectorate

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని సిర్పూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్లలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఎవరైన సాయం కోసం 08732-22302, 225529 ఈ నెంబర్లను సంపద్రించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా సిర్పూర్లో 23 సెం.మీ, మంచిర్యాలలో 16 సెం.మీ, ఆసిఫాబాద్లో 13 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల కారణంగా శ్రీరామ్పూర్, డోర్నీ-1, డోర్నీ -2 కైరీగూడ ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.దీంతో సింగరేణికి తీవ్ర నష్టం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement