తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపానికి వందల మంది మృత్యువాత పడుతుండటం తెలిసిందే. తాజాగా సోమవారం రోజున ప్రకాశం జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టరు సుజాత వర్మ మాట్లాడుతూ.. 'ప్రజలు అప్పమత్తంగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇప్పటి దాకా జిల్లాలో వడదెబ్బతో మృతిచెందిన వారి వివరాలను సేకరించేందుకు మండలాల వారీగా త్రిసభ్య కమిటీ వేశాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లా కలెక్టరేట్లో ప్రజలకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. నంబరు 08592281400, 1077 టోల్ ఫ్రీ నంబరు' ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు.
ఎండ బాధితులకు కంట్రోల్ రూం ఏర్పాటు
Published Mon, May 25 2015 6:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement