విశాఖపట్నంలో భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం వెల్లడించారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800- 42500002ను సంప్రదించాలని జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.
అయితే యలమంచిలి కాలువకు గండి పండింది. దాంతో యలమంచిలిలోని పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో స్థానిక ఎమ్మెల్యేలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు.