ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు | Control room setup in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Published Fri, Nov 14 2014 9:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement