Control room setup
-
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కోసం ఏపీ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
-
4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(అవియన్ ఇన్‌ఫ్లూయెంజా) వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ వెల్లడించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్తాన్‌లోని బరాన్, కోట, ఝలావర్, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్, ఇండోర్, మాల్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా(వలస పక్షుల కేంద్రం), కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో నాలుగు చోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కనుగొన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై తాజా పరిస్థితి అంచనా వేయడానికి ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లో అధికారులు చేపట్టిన బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యలపై రోజువారీ గణాంకాలు సేకరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ నెలకొల్పినట్లు పేర్కొంది. దేశంలో మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలియజేసింది. కర్ణాటకలో హై అలర్ట్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చెప్పారు. కేరళ నుంచి పౌల్ట్రీ కోళ్లు, కోడి మాంసం రవాణా చేయకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి కోడిమాంసం దిగుమతిపై 10 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం చెప్పారు. ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందాలు బర్డ్‌ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్న కేరళలోని అలప్పుజా, కొట్టాయం, హరియాణాలోని పంచకుల జిల్లాలకు బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాల్లో ఎన్సీడీసీ, ఎన్ఐజీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన నిపుణులు ఉంటారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో బాతుల్లో, పంచకుల జిల్లాలో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు వెల్లడించింది. బృందాలు ఆయా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలకు సహరిస్తాయని తెలిపింది. -
కంట్రోల్ రూమ్‌గా కాంగ్రెస్ నేత కార్యాలయం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి తన వంతు కృషి చేస్తున్నారు. ఢిల్లీలో తన కార్యాలయాన్ని కంట్రోల్ రూమ్‌గా మార్చి దేశవ్యాప్తంగా వలస కార్మికులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని వలస కార్మికులతో చర్చించి వారి సమస్యలను తీరుస్తున్నారు. అధీర్ రంజన్ తన భార్య, సిబ్బందితో కలిసి తన కార్యాలయ్యాన్నే ఓ మినీ కంట్రోల్ రూమ్‌గా మార్చారు. వలస కార్మికుల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులు, అక్కడి పార్టీ కార్యకర్తలను సంప్రదించి వెంటనే సహాయం అందేలా చూస్తున్నారు. నిరాశ్రయులైన వలసకార్మికుల వివరాలను సేకరించి వారిని సంప్రదించడంలో అధీర్ సతీమణి, సిబ్బంది తోడ్పాటును అందిస్తున్నారు. తన నియోజక వర్గం బెహ్రాపూర్ నుంచే రోజుకు దాదాపు 500 వరకు సహాయాన్ని కోరుతూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని అధీర్ రంజన్ తెలిపారు. ‘ఆశ్రయం, ఆహారం లేక వలసకార్మికులు రోధిస్తున్నారు. నా నియోజక వర్గంలో ఎక్కువగా పేద వారే ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వారి వివరాలు సేకరించి, వెంటనే సహాయం అందేలా చూస్తున్నాము’ అని అధీర్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, జిల్లా అధికారులను సహాయం కోసం సంప్రదిస్తున్నానని తెలిపారు. బీజేపీ ఎంపీలు, మంత్రులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వలస కార్మికుల కోసం సంప్రదిస్తున్నానన్నారు. వారు కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతున్నారని చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని, వారి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అధీర్ మండిపడ్డారు. లాక్డౌన్ ముగియగానే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలసకార్మికులు దేశంలో ఎక్కడున్నా స్వరాష్ట్రానికి తీసుకురావడంలో సహాయాన్ని అందించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు.(వలస కార్మికులను తరలించండి) -
ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు. -
ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు: ఖమ్మం కలెక్టర్
లెహర్ తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీనరేష్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అధికారులంతా విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లెహర్ తుఫాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వెంటనే 08742231600, 08744249994, 08743232426కు ఫోన్ చేయాలని సూచించారు. లెహర్ తుఫాన్ వల్ల జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ విజ్ఞప్తి చేశారు. -
తుమ్మలపెంటలో ముందుకు దూసుకొచ్చిన సముద్రం
నెల్లూరు సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తుమ్మలపెంట వద్ద సముద్రం 35 అడుగుల మేర ముందుకు వచ్చింది. దాంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని సముద్ర తీరంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఇప్పటికే నెల్లూరు చేరుకుంది. హెలెను తుఫాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలకు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన వెంటనే 08612331477, 2331261కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.