వర్షాకాలం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
*బల్దియాలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూం 18004251980
*53 డివిజన్లు, 42 విలీన గ్రామాలకు సేవలు
*24 గంటలపాటు సేవలందించేలా ఏర్పాట్లు
వరంగల్ : వర్షాకాలం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ముంపు ప్రాంతాలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 53 డివిజన్లతోపాటు నగరంలో విలీనమైన 42 గ్రామాల్లో సత్వర సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా 18004251980 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ మేరకు వరంగల్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ఫిర్యాదులు స్వీకరిం చేలా ఉద్యోగులకు విడతల వారీగా విధులు కేటాయించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 4... సాయంత్రం 4 నుంచి రాత్రి 12... రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు ఒక్కొక్కరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు నమోదు చేసుకుంటారని... ఆ తర్వాత నోడల్ అధికారులు వెంటవెంటనే సహాయక చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు.