దారి దోపిడీ దొంగల అరెస్ట్
దారి దోపిడీ దొంగల అరెస్ట్
Published Sat, Jan 28 2017 10:46 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
కల్లూరు: జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశామని కర్నూలు డీఎస్‌పీ రమణమూర్తి తెలిపారు. స్థానిక పోలీసు కంట్రోల్ రూమ్‌లో శనివారం.. డీఎస్‌పీ రమణమూర్తి, సీఐ నాగరాజుయాదవ్ సమక్షంలో నలుగురు దోపిడీ దొంగల అరెస్టును చూపించారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ మాట్లాడుతూ.. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు పర్యాయాలు దారి దోపిడీ జరిగిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో గుడిసె గోపురాలకు చెందిన ఆంజనేయులు గౌడు గొర్రెల ఆటోను ఆపి దోచుకున్నారని, రెండోసారి అనంతపురానికి చెందిన శివారెడ్డి (లారీ డ్రైవర్) జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా నిలబెట్టి బెదిరించి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు, తదితర విలువైన వాటిని దోచుకెళ్లారని తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి అరతులం బంగారు ఉంగరం, ఒక తులం వెండి ఉంగరం, ఒక కత్తి, ఒక ద్విచ క్రవాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దూపాడు సమీపంలోని కల్పన డాబా వీరిని ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారన్నారు.
దొంగలు వీరే..
వీకర్‌సెక‌్షన్ కాలనీకి చెందిన మార్కెండేయులు, రామచంద్రుడు, మహేశ్వరరెడ్డి, కోడుమూరుకు చెందిన మౌలాలి, గోపాలు అనే ఐదుగురు సంయుక్తంగా కలిసి వ్యభిచారం చేసే ఒక మహిళను బెదించి రోడ్డు పైకి తీసుకువచ్చి వాహనదారులను ఆకర్షించేవారు. మహిళ వద్దకు వాహనదారులు రాగానే పొలాల్లో దాక్కున్న వీరు వచ్చి కత్తితో బెదిరించి దోచుకునే వారు. ఐదుగురిలో గోపాల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని, పట్టుకున్న నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించామని డీఎస్‌పీ రమణమూర్తి తెలిపారు.
Advertisement