అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌ | inter district robbers gang arrest | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌

Published Sat, Jan 7 2017 11:22 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌ - Sakshi

అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌

– డోన్‌ కేంద్రంగా వివిధ చోరీలకు
    పాల్పడిన వైనం 
– ఎనిమిది చోరీలకు సంబంధించి
   ఆరు లక్షల రికవరీ 
– డోన్‌ పోలీసులను
  అభినందించిన జిల్లా ఎస్పీ 
  
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): డోన్‌ కేంద్రంగా దేవాలయాలు, షాపులు, ఇళ్లలో చోరీలకు ప్పాలడే అంతర్‌ జిల్లాల దొంగల ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది చోరీలకు సంబంధించి ఆరు లక్షల రూపాయలను రికవరీ చేశారు. శనివారం డోన్‌ పట్టణం నుంచి గుత్తి వైపు వెళ్లే జాతీయ రహదారిలోని రాయల్‌ వే బ్రిడ్జి సమీపంలో ఉన్న దొంగల ముఠాను డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసుల బృందం అరెస్టు చేసి జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ ఎదుట హాజరుపరచారు. నిందితుల వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన పాలగిరి స్వామి అలియాస్‌ స్వామి అలియాస్‌ బాబాయి(40), అనంతపురం జిల్లా అవులదట్ల గ్రామానికి చెందిన రమావత్‌ వినోద్‌కుమార్‌ అలియాస్‌ శివ(23), గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఉద్దంటి రాంబాబు అలియాస్‌ అమర్‌(35), కర్నూలు జిల్లాకు చెందిన షేక్‌ చాంద్‌బాషా(48) ముఠాగా ఏర్పాడి డోన్‌ కేంద్రంగా పలు చోరీలకు పాల్పిడినట్లు తెలిపారు.
 
చోరీలకు పాల్పడింది ఇలా
  •  డోన్‌లోని కంబాలపాడు జంక‌్షలోని ఈద్గా కాంప్లెక్స్‌లో 2016 ఆగస్టు 29న  మూడు షాపుల్లో చోరీకి పాల్పడి 29 వేల ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, దుస్తులు ఇతర వస్తువులను అపహరించగా, మొత్తం సొమ్మును రికవరీ చేశారు. 
  •  డోన్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఇంట్లో గత ఏడాది సెప్టెంబర్‌ 13న 10 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఇందులో రెండు తులాల నక్లెస్, 2 తులాల తాలిబొట్టు గొలుసు, ఒకట్నిర తులం కటింగ్‌ చైన్, రెండు జతల కమ్మలు మొత్తం ఆరు తులాలు ఉంటుంది. వాటి విలువ 1,90,000
  •  డోన్‌కు సమీపంలోని ఉడుములపాడు ఆంజనేయస్వామి దేవాలయంలో గత ఏడాది అక్టోబర్‌ 28న శ్రీరాముల వారి పంచలోహ ఉత్సవ విగ్రహాలను దొంగిలించగా వాటిన్నింటని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1.50 లక్షల ఉంటుంది. అదేగ్రామంలో నవంబర్‌ 16న  దత్తాత్రేయ దేవాలయంలో అమ్మవారి వెండి కీరిటాన్ని చోరీకి గురవ్వగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.15 లక్షలు ఉంటుంది.
  • డోన్‌కు సమీపంలోని అంజనేయస్వామి దేవాలయంలో అక్టోబర్‌ 20న 30 కేజీల 3 ఇత్తడి గంటలను దొంగింలించగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 వేలు.
  •  డోన్‌లోని విజయభాస్కరరెడ్డి మార్కెట్‌లో నవంబర్‌ 5న ఓ షాపు, దానికి పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక టీవీ, గుడి గంట, రెండు దీపపు స్తంభాలు, హుండీలో చిల్లర దొంగిలించారు. ఇందులో రెండు దీపపు స్తంభాలు, గంట, టీవీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 36 వేలు ఉంటుంది.  
  •  వెల్దుర్తి మండలం గోవర్దనగిరి గ్రామంలో అక్టోబర్‌ 5న 21 కేజీల కాపర్‌ వైరు, 35 లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్, 1120 మీటర్ల అల్యూమినియం వైరు, 330 మీటర్ల ఎల్‌టీఏబీ కేబులు వైరును దొంగించాలరు. ఇందులో అల్యూమినీయం వైరు, ఎల్‌టీఏబీ కేబుల్‌ వైరు, కాపర్‌ వైర్లను స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ. 46 వేలు ఉంటుంది.
- వెల్దుర్తి మండలం ఎల్‌బండ గ్రామ పొలిమేర్లలో  డిసెంబర్‌ 25వ తేదీన కాపర్‌ వైరు దొంగిలించారు. దీని విలువ రూ. 26 వేలు ఉంటుంది. 
- అంతర్‌ జిల్లాల ముఠాను పట్టుకున్న డోన్‌ సీఐ వై.శ్రీనివాసులు, ఎస్‌ఐ వీ.శ్రీనివాసులు, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ నాగన్న, వెంకటేష్‌నాయక్, రాజక్, హోంగార్డు భాస్కరరెడ్డి, నాయుడు, శ్రీకాంత్‌ను జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ అభినందించారు.      
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement