సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ శాసనసభను వేది కగా చేసుకుని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఈ చీకటి ఒప్పందంతో మహారాష్ట్ర ప్రభుత్వం భవిష్యతులో ఇన్‌టెక్‌వెల్ ఏర్పాటు పేరిట మరింత పెద్ద ఎత్తున నీటి దోపిడీకి పాల్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చీకటి ఒప్పందం ఫలితంగా తెలంగాణ జాతి కేసీఆర్‌ను క్షమించబోదని హెచ్చరించారు. మానీరు-మాకే’ నినాదంతో త్వరలోనే ఆయా జిల్లాలకు వెళ్లి మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న చీకటి ఒప్పందాన్ని ఎండగడతామని చెప్పారు. కరీంనగర్‌లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలసి జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికే కేసీఆర్ ప్రభుత్వం నియమిం చిన ఇంజనీర్ల కమిటీ మొగ్గుచూపింద న్నా రు. 2014 ఆగస్టులో జరిగిన మహారాష్ట్ర-తెలంగాణ ఇంజనీర్ల సమావేశంలోనూ టీఆర్‌ఎస్ నేత, రిటైర్డ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు సైతం తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని సూచించా రని పేర్కొన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాహుబలికి మించిన సినిమా చూపారని, స్పీకర్ అవకాశమిస్తే పవర్‌పాయింట్ ద్వారా రాష్ట్రంలోని యథార్థ పరిస్థితిని వివరించేం దుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
కేసీఆర్.. నిన్ను తెలంగాణ జాతి క్షమించదు
Published Sat, Apr 2 2016 12:46 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement