రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
Published Tue, Jul 19 2016 11:07 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అవసరం లేని కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం, రుణమాఫీ governament, agritcultre, sridharbabu
ధర్మపురి/వెల్గటూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. పంటలు లేక అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోని సర్కారు... అవసరం లేని కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు. ధర్మపురిలోని బ్రాహ్మణlసంఘం భవనంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెల్గటూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర రైతాంగం అనేక కష్టాల్లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం హరితహారం పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ ఉచిత విద్య నెరవేరని కోర్కెలుగానే మిగిలాయన్నారు. రానున్న కాలంలో ప్రజలు కళ్లుతెరువక తప్పదన్నారు. టీఆర్‌ఎస్ ప్రలోభాలకు ఆశపడి కొంతమంది కాంగ్రెస్ వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఈనెల 25న పెద్దపెల్లిలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు దినేష్, ఇంద్రాల మల్లేశం, సీనియర్ నాయకులు గోమాస శ్రీనివాస్ , ఎల్లాగౌడ్, చుక్కరవి, కస్తూరి శ్రీనివాస్, వెల్గటూర్‌లో మాజీ ఏఎంసీ చైర్మన్ చుక్క శంకర్‌రావు, సర్పంచ్ గుండాటి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement