ఈత రాకున్నా.. ప్రాణాలకు తెగించి.. | Man Saves Child Life After Fell Into Quarry | Sakshi

ఈత రాకున్నా.. ప్రాణాలకు తెగించి..

Published Mon, Nov 25 2019 10:29 AM | Last Updated on Mon, Nov 25 2019 10:29 AM

Man Saves Child Life After Fell Into Quarry - Sakshi

చిన్నారిని కాపాడిన సంజీవ్‌

సాక్షి, కుత్బుల్లాపూర్‌ : క్వారీ గుంతలో పడ్డ  చిన్నారిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈత రాకున్నా బాలుడిని రక్షించాలన్న ఉద్దేశంతో సాహసం చేసి అందరి మన్నన్నలు పొందాడు.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌ రంగారెడ్డిబండ సమీపంలో క్యారీ గుంత ఉంది. ఇందులో వర్షపునీరు చేరడంతో సరదాగా పిల్లలంతా నీటి పక్కన ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో మహేశ్, అంజమ్మల కుమారుడు వంశీ(4) ఒక్కసారిగా నీటిలో పడి మునిగిపోయాడు. అక్కడే మరో వ్యక్తి అంజి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనిస్తున్న సంజీవ్‌  క్వారీగుంతలోకి ఒక్క ఉదుటున దూకీ బాలుడిని పైకి తీసుకు వచ్చాడు. అప్పటికే పూర్తిగా నీళ్లు తాగిన ఆ బాలుడు అచేతన స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు బాలుడి కడుపు, ఛాతిపై ఒత్తడంతో నీళ్లు బయటకు కక్కాడు. చిన్నారి సాధారణ స్థితిని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement