
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి మల్లారెడ్డి ఆడియో టేపు కలకలం రేపుతోంది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని బోడుప్పల్ టీఆర్‌ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారని, తన వర్గానికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. టికెట్ కేటాయింపు విషయమై ఆయన మల్లారెడ్డితో మాట్లాడిన ఫోన్‌కాల్‌కు సంబంధించిన ఆడియో టేపు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ ఆడియోటేపు అధికార పార్టీలో చర్చనీయాంశమైందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment