
కంటోన్మెంట్ (హైదరాబాద్): తనపై ఐదుగురు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల పట్ల మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ అదో చిన్న సమస్యని..దయచేసి పెద్దది చేయవద్దని కోరారు. మంగళవారం ఉదయం బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
తామంతా ఒకటే కుటుంబమని, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలుంటాయని, మీడియా కూడా దీన్ని పెద్దగా చిత్రీకరించవద్దని వేడుకున్నారు. ఈ సమస్యను మా ఫ్యామిలీ (పార్టీ) పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామన్నారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.
చదవండి: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
Comments
Please login to add a commentAdd a comment