YS Avinash Reddy Key Comments Over Bhaskar Reddy's Arrest - Sakshi
Sakshi News home page

విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్‌ రెడ్డి

Published Sun, Apr 16 2023 4:17 PM | Last Updated on Mon, Apr 17 2023 2:03 AM

YS Avinash Reddy Key Comments Over Bhaskar Reddy Arrest - Sakshi

సాక్షి, పులివెందుల: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్‌ చేసింది. ఇక, భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌పై  ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందించారు. 

‘భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్‌ చేయించారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. లెటర్‌ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే.  పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను. 
చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?

సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్‌మెంట్‌లోనే అనేక కీలక అంశాలున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదు. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్‌ ఇస్తున్నారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్‌ వేయించారు. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్‌ ఇప్పించింది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. ఏప్రిల్‌ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం అని అన్నారు.  
చదవండి: రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు! 

పోలీసులు రావొద్దని నేను చెప్పాననడం దారుణం. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. స్టాంపు పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్‌ పేపర్ల పరిశీలన, దొంగతనం జరిగింది. చోరీ కేసు ఎందుకు పెట్టలేదు.. ఆ దిశగా ఎందుకు విచారించలేదు?. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. వివేకా.. షేక్‌ మహ్మద్‌ అక్బర్‌గా 2010లో పేరు మార్చుకున్నారు. వివేకాకు పెహన్‌ షా అనే కుమారుడు ఉన్నాడు. వివేకా రాసిన లెటర్‌ అక్కడే ఉంది. లెటర్‌ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. మాకు పదవులపై వ్యామోహం లేదు. వ్యవస్థలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. చివరకు నిజాయితీయే గెలుస్తుంది’ అని తెలిపారు. 



 

చదవండి:  భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement