పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం | AP News: Nandyal MP, MLA Cold War Over Transfers | Sakshi
Sakshi News home page

పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం

Published Tue, Aug 20 2024 10:03 AM | Last Updated on Tue, Aug 20 2024 10:51 AM

AP News: Nandyal MP, MLA Cold War Over Transfers

నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు.  

నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. 

ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న  పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు  తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్‌ పోలీస్‌ సిబ్బంది నలిగిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement