కొన్నాళ్లుగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్‌ల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ కొనసాగింది. పలు అంశాలపై ఇద్దరూ మాటల తూటాల పేల్చుకోవడం.. పరస్పరం కౌంట ర్లు ఇచ్చుకోవడంతో అధికారులు మొహమొహాలు చూసుకున్నా రు. వారిద్దరి మధ్య సాగిన మాటల యుద్ధం తీరు ఇలా ఉంది...
రైతు రుణమాఫీపై మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలని, రైతుల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించాలని బ్యాంకర్లకు సూచిం చా రు. దీనివల్ల రైతులు ఎన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో వెల్లడవుతుందన్నారు. విప్ రవికుమార్ జోక్యం చేసుకొని ఆధా ర్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున అన్నిం టికీ ఆధార్‌ను అనుసంధానించాల్సిన పని లేదని అన్నారు. సమావేశాలకు ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపకపోవడం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎస్‌ఎంఎస్‌లు చూడటం అలవాటు చేసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించగా విప్ అడ్డుతగిలి.. అలా కాదు కచ్చితంగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, సంప్రదాయం పాటించాలని స్పష్టం చేశారు.
ఒక సందర్భంలో బీపీఎల్ కుటుంబాలంటే తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారేనని అచ్చెన్న అంటే.. కాదు కాదు.. బీపీఎల్ కుటుంబాల నిర్ధారణకు ప్రత్యేక పరామీటర్లు ఉంటాయని విప్ చెప్పారు. మరో సందర్భంలో పంటల బీమా ఎవరికి వర్తిస్తుందని విప్ రవికుమార్ ఆధికారులను అడగ్గా మంత్రి అచ్చెన్న కలగజేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య సంవాదం జరిగింది. ఫలితంగా అధికారుల నుంచి సరైన సమాధానం లభించకముందే మరో ఆంశంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. రైతు రుణాల రీషెడ్యూల్, డ్వాక్రా రుణాలపై వడ్డీ చెల్లింపు తదితర చర్చల్లోనూ ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒక దశలో విప్ వాదనలకు సమాధానం చెప్పలేక మంత్రి అచ్చెన్న అసహనం వ్యక్తం చేశారు.
మాట.. తూటా!
Published Thu, Aug 14 2014 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement