
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. సల్మాన్‌తో పాటు వీరిద్దరు దబాంగ్ రీలోడెడ్ పేరిట నిర్వహిస్తున్న షోల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన జాక్వలిన్, కత్రినాలు ఒకరికొకరు ఎదురుపడటానికి సైతం ఇష్టపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ టూర్‌కు వీరితో పాటు సోనాక్షి సిన్హా, మనీశ్ పాల్‌లు కూడా వెళ్లారు. కత్రినా, జాక్వలిన్‌ల మధ్య అంతరాయలను గమనించిన సల్మాన్ వీరిద్దరు ఒకరికొకరు తారసపడకుండా చూడాలని ఇతర టీమ్ సభ్యులకు సూచించారు. హోటలల్లో కూడా కత్రినా, జాక్వలిన్‌లకు కేటాయించే రూమ్‌లు దూరంగా ఉండేలా వారు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.