
ఆయనకు నా నటన నచ్చలేదనుకుంటా?
నటుడు ధనుష్‌కు నా నటన నచ్చలేదనుకుంటా అని ఆయన ఎదుటే బహిరంగంగానే అడిగేసి మరో సంచలనానికి తెర లేపారు నటి నయనతార. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. వివరాల్లోకెళ్లితే ధనుష్ నిర్మించిన రెండు చిత్రాలు ఒకే వేదికపై అవార్డును గెలుచుకున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ధనుష్ నిర్మించిన కాక్కాముట్టై ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకోగా, మరో చిత్రం నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటించిన నయనతారకు ఉత్తమ నటి అవార్డు వ రించింది. కాక్కాముట్టై చిత్ర అవార్డును నిర్మాతగా అందుకున్న ధనుష్ ఆ చిత్రం గురించే మాట్లాడారు. అనంతరం ఉత్తమ నటి అవార్డును అందుకోవడానికి వేదికపైకి వచ్చిన నయనతార మాట్లాడుతూ ధనుష్ తన నటన నచ్చినట్లు లేదు. అందుకే తను గురించి ఇక్కడ ప్రస్థావించలేదు అని అన్నారు. అది తన ఆవేదనా? లేక ధనుష్‌పై ఆరోపణా అన్న చర్చ కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా జరుగుతోంది.
అంతే కాదు అదే వేదికపై ఈ అవార్డును దర్శకుడు విఘ్నేశ్‌శివకే డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించిన నయనతార ఇటీవల ఈ ప్రేమికులిద్దరూ విడిపోయారన్న వదంతులకు బదులిచ్చినట్లయింది. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ నయనతార చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివ సమయానికి షూటింగ్‌కు రాకుండా చిత్ర నిర్మాణ బడ్జెట్‌ను పెంచేశారనే ప్రచారం అప్పట్లో హల్‌చల్ చేసింది. ఆ కారణంగానే ధనుష్ ఇప్పుడు నయనతార గురించి నోరు మెదపలేదని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.