లండన్‌పై రష్యా అణుబాంబులు!
బ్రిటన్‌తో ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న కాలంలో లండన్ నగరం మీద అణుదాడికి రష్యా ప్రణాళిక రచించిందా? దక్షిణ లండన్‌లోని క్రొయ్‌డన్‌లో అణుబాంబులు వేయాలని భావించిందా? అంటే తాజాగా వెలుగుచూసిన టాప్ సీక్రెట్ లేఖ అవుననే అంటున్నది. లండన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నది హెచ్చరిస్తూ 1954లో బ్రిటన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ ఎడ్విన్ ప్లొడన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇటీవల మరణించిన ప్లోడన్ 1954లో చేతిరాతతో రాసిన లేఖను జాతీయ అర్కైవ్ సంస్థ ఆదివారం విడుదల చేసింది. ఈ లేఖ ప్రకారం లండన్ మీద వేసేందుకు రష్యా దగ్గర 32 బాంబులు సిద్ధంచేసిందని, ఇందులో నాలుగో, ఐదో బాంబులు వేసినా.. భారీస్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఆయన పేర్కొన్నారని మిర్రర్ పత్రిక పేర్కొంది.
1924-53 మధ్యకాలంలో రష్యా పాలకుడిగా జోసెఫ్ స్టాలిన్ ఉండగా.. 1954-63 వరకు నికిత కృశ్చెవ్ ఉన్నారు. 1945లో జపాన్‌లోని నాగాసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల కంటే ఈ బాంబులు మరింత శక్తివంతమైనవని, వీటి పేలుడు చోటుచేసుకున్న ప్రదేశంలో మూడు మైళ్ల వరకు పూర్తిగా విధ్వంసమవుతుందని ఆయన లేఖలో హెచ్చరించారు.