nuclear bombs
-
కాంగ్రెస్ నాయకులు పిరికిపందలు: మోదీ
ముజఫర్‌పూర్/హాజీపూర్/సరణ్: పిరికిపందలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ అణుబాంబులకు భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ సహా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు పాకిస్తాన్ అణుశక్తిని తలచుకొని చూసి బెంబేలెత్తిపోతున్నానని, వారికి రాత్రిపూట పీడకలలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సోమవారం బిహార్‌లోని ముజఫర్‌పూర్, హాజీపూర్, సరణ్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. పిరికిపందలు, భయస్థులైన మన ప్రతిపక్ష నాయకులు ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కు క్లీన్చిట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పాకపాకిస్తాన్ భూభాగంపై మన సైన్యం చేసిన సర్జికల్ దాడుల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, సైనికుల సాహసాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. అణ్వా యుధాలను వదిలించుకోవాలంటూ వామపక్ష నాయకులు ఇస్తున్న పిలుపును ప్రధానమంత్రి తప్పుపపట్టారు. బహిరంగ సభల్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... గాజులు కూడా లేవా! ‘‘పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని మన విపక్ష నాయకులు అంటున్నారు. అయితే, ఆ దేశం గాజులు తొడుక్కునేలా చేస్తాం. కడుపు నింపుకోవడానికి పాకిస్తాన్‌కు తిండి లేదని, ఆహారా ధాన్యాలు లేవని నాకు తెలుసు. పాకిస్తాన్‌కు విద్యుత్ సైతం లేదు. గాజులు కూడా లేవన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికో ప్రధానమంత్రి మారుతారట! ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు అనే ఫార్ములాను తీసుకొస్తున్నారు. నిజంగా అలా సంవత్సరానికో ప్రధానమంత్రి మారిపోతే దేశం ముందుకెళ్లడం సాధ్యమేనా? అలాంటి విధానం మనకు సరిపడదు. ప్రపంచదేశాల్లో మన ప్రతిష్ట పెరిగింది. అభివృద్ధి వేగవంతమైంది. మన దేశ ప్రతిష్టను ఇంకా పెంచడంతోపాటు ప్రగతిని కొనసాగించే ప్రభుత్వం కావాలి. అది బీజేపీ కూటమితోనే సాధ్యమవుతుంది. రాజకీయ నాయకుల నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు చేసి, స్వా«దీనం చేసుకున్న డబ్బంతా ముమ్మాటికీ పేదలకే చెందుతుంది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల కార్యాచరణపై ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వారి అవినీతి, అక్రమ సొమ్మును స్వా«దీనం చేసుకోవడమే ఇందుకు కారణం. గతంలో కాంగ్రెస్ పాలనలో ఈడీ కేవలం రూ.35 లక్షలు స్వా«దీనం చేసుకుంది. ఒక స్కూల్‌బ్యాగ్‌లో ఆ డబ్బును సర్దొచ్చు. మేము అధికారంలోకి వచ్చాక ఈడీ రూ.2,200 కోట్లు స్వా«దీనం చేసుకుంది. ఆ డబ్బును తరలించాలంటే 70 చిన్నపాటి ట్రక్కులు కావాలి. ప్రతిపక్ష నేతలకు వారసులు ఉన్నారు. ఆ వారసుల బాగు కోసమే వారు తపన పడుతుంటారు. నాకు వారసులు లేరు. సామాన్య ప్రజలే నా వారసులు. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తున్నాయి. నేను బతికి ఉన్నంతకాలం ఇలాంటి ఆటలు సాగనివ్వను’’. అని మోదీ వివరించారు. పట్నా గురుద్వారాలో భక్తుల సేవలో మోదీ ప్రధాని మోదీ సోమవారం బిహార్ రాజధాని పటా్నలోని తఖ్త్ శ్రీహరిమందిర్జీ పట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. సంప్రదాయ తలపాగా ధరించి, దర్బార్ సాహిబ్‌లో సిక్కుల పవిత్ర గ్రంథం ఎదుట ప్రణమిల్లారు. ప్రార్థనలు చేశారు. అనంతరం వంటశాలలో గరిటె తిప్పారు. కూర వండారు. రొట్టెలు కాల్చారు. లంగర్లో భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించారు. పట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడం, ఇక్కడ ప్రార్థనలు చేయడం గొప్ప ఆధ్యాతి్మక అనుభూతినిచ్చాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సిక్కు గురువుల బోధనలు మనకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, మనల్ని ముందుకు నడిపిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్‌లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..? -
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్‌ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్‌గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై హెచ్చరించారు. ‘అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్ చేయాలి. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు ట్రంప్. అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు స్పందించటం సంచలనంగా మారింది. క్యూబన్ మిసైల్స్‌తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Russia Ukraine War: పుతిన్ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
‘అణు’ పల్లవి!
కొన్ని మొదలుపెట్టడం సులభమే. ముగించడమే కష్టం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు ఆ సంగతి బాగా తెలిసొచ్చినట్టుంది. సరిగ్గా 7 నెలల క్రితం ఫిబ్రవరి 24న లక్షన్నర పైగా సైనికులతో, వివిధ మార్గాల ద్వారా ఉక్రెయిన్‌పై ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’కు సిద్ధమైనప్పుడు ఆ దేశాన్ని లొంగ దీసుకోవడం ఆయన సులభమనుకున్నారు. తీరా అమెరికా, ఐరోపాల ఆర్థిక, సైనిక అండదండలతో ఉక్రెయిన్ ఎదురుదెబ్బకి దిగేసరికి పీటముడి పడింది. పాశ్చాత్యలోకం నుంచి ముప్పు ఉందంటూ, 3 లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణకు సిద్ధమవుతున్నట్టు బుధవారం పుతిన్ చేసిన ప్రకటన మొదట అనుకున్న వ్యూహం విఫలమైందనడానికి స్పష్టమైన సంకేతం. జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ, అణుదాడులకు సిద్ధమన్న ఆయన మాట ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఇవి ఉత్తుత్తి మాటలు కావనడంతో ఆయన బెదిరింపు ధోరణి బాధ్యతారహితమనీ, ఐరాస నిబంధనావళికి విరుద్ధమనీ అమెరికా అధ్యక్షుడు ఖండించాల్సి వచ్చింది. వెరసి, అంతులేని కథగా సాగుతున్న ఉక్రెయిన్ అంశం మళ్ళీ ఒక్కసారిగా అందరిలో వేడి పెంచింది. అణ్వస్త్ర దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాతో పాటు రష్యా ఒకటి. అణుయుద్ధం చేయరాదంటూ ఈ జనవరి 3న రష్యా సహా ఆ దేశాలన్నీ సమష్టి ప్రకటన చేశాయి. ఆ తర్వాతే ఉక్రె యిన్‌పై పుతిన్ ఆకస్మిక దాడి ఆరంభించారు. సమయానికి తగ్గట్టు మాటలు, చేష్టలు మార్చేయడం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్న ఈ మాజీ రష్యన్ గూఢ చారికి మంచినీళ్ళ ప్రాయం. ఉక్రెయిన్‌లో తాము పట్టు బిగించిన తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి నిలపడానికి ఆ మధ్య కీవ్, ఖార్కివ్‌ల నుంచి రష్యా సేనల్ని ఉపసంహరించుకున్నారు. తీరా ఈ నెల మొదట్లో ఉక్రెయిన్ మెరుపుదాడితో ఈశాన్యంలో దెబ్బతిని, సైన్యం తిరోగమించింది. ప్రతీకారంతో రగిలిపోతున్న పుతిన్ ‘అణు’పల్లవి అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలి సారి సైనిక సమీకరణకూ దిగారు. అదేమంటే సోవియట్‌లా రష్యా విచ్ఛిత్తికీ కుట్ర జరుగుతోందన్నారు. ఒక పక్క ఇలా సమరం చేస్తూనే, మరోపక్క ఉక్రెయిన్‌లో తమ స్వాధీనంలోకి వచ్చిన కీలక ప్రాంతాల్లో రష్యన్ సమాఖ్యలో చేరికపై ప్రజాభిప్రాయ సేకరణలు జరిపించాలని పుతిన్ ప్రయత్నం. ఆ కంటితుడుపు రిఫరెండమ్‌ల వెనుక ఉద్దేశం, వచ్చే ఫలితం ఇట్టే ఊహించవచ్చు. వాటిని అడ్డుపెట్టు కొని, ఉక్రెయిన్‌లో పట్టుబిగించిన ప్రాంతాలను కలిపేసుకొని ముందరికాళ్ళకు బంధం వేయాలని రష్యా వ్యూహం. గురువారం ఐరాస భద్రతామండలి సైతం రిఫరెండం ప్రతిపాదనల్ని ఖండిస్తూ, కనుచూపు మేరలో యుద్ధానికి ముగింపు కనపడకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, యుద్ధభూమిలో ఎక్కడ, ఎవరిది, ఎంత పైచేయి అన్నది పక్కనపెడితే ఉక్రెయిన్‌కు సైతం భరించ లేని ఉక్కపోత ఉంది. అమెరికా, ఐరోపా దేశాల అండ చూసుకొని బరిలో నిలిచిన ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీకి సైతం ఇప్పుడు తగిలిన దెబ్బలతో తత్త్వం తలకెక్కుతోంది. బుధవారం ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తమ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం పంచసూత్రాలు పాటించాలని ఆయన అభ్యర్థించడం అందుకు తాజా ఉదాహరణ. ఉక్రెయిన్ బాధ... ప్రపంచపు బాధగా భావించాలనేదే ఇప్పటికీ జెలెన్స్కీ ధోరణి. చిత్రం ఏమిటంటే, ఆంక్షల వల్ల రష్యాపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ, పాశ్చాత్య ప్రపంచం మాత్రం అదే మంత్రాన్ని నమ్ముకున్నట్టుంది. తాజాగా 8వ విడత ఆంక్షలను రష్యాపై విధించింది. నిజానికి, పలు పాశ్చాత్య ఆహార, వస్తూత్పత్తి బ్రాండ్లు తమ భూభాగాన్ని వీడినా, రష్యా సొంత బ్రాండ్లు సృష్టించుకుంటోంది. చైనా నుంచి సరకుల సరఫరా సాగుతుండడంతో ఆ విధమైన నొప్పి కూడా తెలియడం లేదు. రష్యా నుంచి గ్యాస్ సరఫరాకు ఆంక్షలు పెట్టి, పాశ్చాత్య ప్రపంచమే ఇరు కున పడింది. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే రష్యాలోనే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. నిజానికి, రష్యా గడపలోకొచ్చి ‘నాటో’ రెచ్చగొట్టడం వల్లే పుతిన్ దూకుడు చూపారు. కానీ, అరకొర వ్యూహం, అతిగా బలాన్ని అంచనా వేసుకోవడంతో తంటా వచ్చింది. ‘నాటో’కు ముకుతాడు వేయాలన్న వ్యూహం ఫలించకపోగా, బలహీనపడుతున్న కూటమి ఫిన్లాండ్, స్వీడన్ లాంటి కొత్త చేరికలతో బలం పుంజుకుంది. లేని ప్రాసంగికతను సమకూర్చుకుంది. ఇది పుతిన్ వ్యూహాత్మక తప్పిదమే! పరిమిత యుద్ధంతో సైనిక లక్ష్యాలు సాధించాలని మొదలుపెట్టిన పుతిన్ వెనక్కి రాలేనంత దూరం వెళ్ళారు. ఈ ప్రక్రియలో తడబడి కిందపడ్డా, తనదే పైచేయిగా చూపాలని తాపత్రయపడు తున్నారు. నిన్నటి దాకా ‘నిస్సైనికీకరణ’ అన్న రష్యా ఇప్పుడు సమష్టి పాశ్చాత్య ప్రపంచంపై యుద్ధం అంటోంది. అతివాద జాతీయతతో పుతిన్ రేపిన ఈ యుద్ధం రష్యా యుద్ధమనే రంగు అద్దుకుంది. కానీ, ఇప్పటికే వేల సంఖ్యలో సైనికుల్ని కోల్పోయిన రష్యాలో తాజా సైనిక సమీకరణ యత్నంపై వందల మంది నిరసనకు దిగారు. మొదట నల్లేరుపై బండి నడక అనుకున్న ఉక్రెయిన్‌పై విజయం ఇప్పుడు పుతిన్‌కు ముగింపు తెలియని పీడకలగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ గాయపడ్డ పులి ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందో? ఐరాసను ఆడిస్తున్న పాశ్చాత్య ప్రపంచం సైతం భేషజాలతో అగ్నికి ఆజ్యం పోసే కన్నా, సామరస్య పరిష్కారానికి కృషి చేస్తే మేలు. ఇటీవల సమర్కండ్లో పుతిన్‌ను కలిసినప్పుడు భారత ప్రధాని చెప్పినట్టు ప్రపంచంలో ‘‘సమరానికి ఇది సమయం కాదు.’’ కరోనా అనంతర క్లిష్టపరిస్థితుల్లో కావాల్సింది శాంతి, సామరస్యం, సౌభాగ్యాలే! -
మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తాం
సియోల్: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ప్రారంభమైన శాంతిచర్చలకు బీటలు వారుతున్నాయి. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుంటే మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని ఉ.కొరియా అమెరికాను హెచ్చరించింది. ఇప్పటికైనా అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉ.కొరియా విదేశాంగ శాఖ చెప్పినట్లు అధికారిక వార్తాసంస్థ కేఎన్సీఏ తెలిపింది. ఉ.కొరియాను అభివృద్ధి పథంలో నడిపేదిశగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు, క్షిపణి పరీక్షలను 2018, ఏప్రిల్‌లో నిలిపివేశారు. ఇక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆరు నెలల క్రితం సింగపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమై కొరియా ద్వీపకల్పం లో శాంతిస్థాపనపై చర్చించారు. పరస్పరం విశ్వాసం నెలకొల్పడం భాగంగా పంగ్యే–రీ అణు పరీక్షా కేంద్రాన్ని సైతం ధ్వంసం చేశారు. అయితే పూర్తిస్థాయిలో అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను ఎత్తివేయబోమని అమెరికా స్పష్టం చేయడంతో కిమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్ తరహాలో ఉందన్నారు. తాజాగా ఆర్థిక ఆంక్షల ను ఎత్తివేయకుంటే అణు కార్యక్రమం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. -
సరదాగా.. సతీ సమేతంగా..
సియోల్: అణుబాంబులు.. అమెరికా నాశనం.. యుద్ధం.. ఇవి తప్ప ఇంకో దాని గురించి ఆలోచించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్టుండీ విహారయాత్రకు వెళ్లారు. నిన్నటి దాకా అణు క్షిపణి పరీక్షలతో, అమెరికాపై యుద్ధానికి కాలుదువ్వుతూ బిజీగా ఉన్న కిమ్.. తన భార్య, సోదరితో కలసి దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఓ కాస్మొటిక్ ఫ్యాక్టరీని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమపై కిమ్ ప్రశంసలు కురిపించారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ‘ఫ్యాక్టరీ నుంచి ప్రపంచస్థాయి ఉత్పత్తులు వస్తున్నాయి. మరింత అందంగా కనిపించాలనే మహిళల కలలను సాకారం చేసే ఉత్పత్తులు ఇక్కడ చేస్తున్నారు’ అని కిమ్ పొగిడినట్లు వెల్లడించింది. కిమ్ భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జోంగ్తోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో ఉన్నారు. గతంలో ఉ.కొరియా అధినేతల భార్యలు, సోదరీమణులు సహా ఇతర మహిళలెవరూ బయటకు వచ్చేవారు కాదు. చాలా తక్కువగా ప్రజలకు కనిపించేవారు. అయితే 2011లో కిమ్ దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాత సంప్రదాయానికి స్వస్తి పలికారు. దీంతో భార్య, సోదరి ఆయనతో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ గాయని కూడా అయిన కిమ్ భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక యో జోంగ్.. పార్టీ పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యురాలు. 1948లో ఉ.కొరియా ఏర్పాటైనప్పటి నుంచి కిమ్ వంశస్థులే దేశాన్ని పాలిస్తున్నారు. -
లండన్‌పై రష్యా అణుబాంబులు!
బ్రిటన్‌తో ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న కాలంలో లండన్ నగరం మీద అణుదాడికి రష్యా ప్రణాళిక రచించిందా? దక్షిణ లండన్‌లోని క్రొయ్డన్లో అణుబాంబులు వేయాలని భావించిందా? అంటే తాజాగా వెలుగుచూసిన టాప్ సీక్రెట్ లేఖ అవుననే అంటున్నది. లండన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నది హెచ్చరిస్తూ 1954లో బ్రిటన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ ఎడ్విన్ ప్లొడన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇటీవల మరణించిన ప్లోడన్ 1954లో చేతిరాతతో రాసిన లేఖను జాతీయ అర్కైవ్ సంస్థ ఆదివారం విడుదల చేసింది. ఈ లేఖ ప్రకారం లండన్ మీద వేసేందుకు రష్యా దగ్గర 32 బాంబులు సిద్ధంచేసిందని, ఇందులో నాలుగో, ఐదో బాంబులు వేసినా.. భారీస్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఆయన పేర్కొన్నారని మిర్రర్ పత్రిక పేర్కొంది. 1924-53 మధ్యకాలంలో రష్యా పాలకుడిగా జోసెఫ్ స్టాలిన్ ఉండగా.. 1954-63 వరకు నికిత కృశ్చెవ్ ఉన్నారు. 1945లో జపాన్‌లోని నాగాసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల కంటే ఈ బాంబులు మరింత శక్తివంతమైనవని, వీటి పేలుడు చోటుచేసుకున్న ప్రదేశంలో మూడు మైళ్ల వరకు పూర్తిగా విధ్వంసమవుతుందని ఆయన లేఖలో హెచ్చరించారు.