
టీడీపీ నేతల కోల్డ్ వార్
అనంతపురం: అనంతపురం టీడీపీ నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నగరపాలక సంస్థ సమావేశం సాక్షిగా ఈ విషయం మరోసారి వెల్లడైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప వర్గాల మధ్య ఆధిత్యపోరు కొనసాగుతోంది. నగరపాలక సంస్థలో రూ.13 లక్షల అవినీతిపై విచారణ జరపాలని ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేయగా, రూ. 1.17 కోట్ల అక్రమాలపై నిగ్గు తేల్చాలని కార్పొరేటర్ ఉమామహేశ్వరి పట్టుబట్టారు. దీంతో సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది.
కాగా, అనంతపురంలో రోడ్ల విస్తరణకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మేయర్ స్వరూప ఆరోపించారు. నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు. మేయర్ కుమ్మక్కు రాజకీయాల గురించి చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు.