సియోల్: మరిన్ని అణుపరీక్షలు నిర్వహించాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ అధికారుల్ని ఆదేశించారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ‘అణ్వాయుధ దాడి సామర్థ్యం మరింత పెంచాలి.. కొత్తగా తయారుచేసిన అణ్వాయుధాల శక్తి తెలుసుకునేందుకు పరీక్షలు కొనసాగించాలి... దాడి సామర్థ్యంపై అవగాహనకు పరీక్షలు నిర్వహించాలి’ అని అధ్యక్షుడు కిమ్ చెప్పారంటూ కేసీఎన్‌ఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
జనవరిలో ఉత్తరకొరియా అణుపరీక్ష నిర్వహించడంతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల ఏడోతేదీ నుంచి దక్షిణకొరియా, అమెరికా దళాలు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఉత్తరకొరియా తీవ్రంగా ఖండించడంతో పాటు అణ్వాయుధాలతో దక్షిణకొరియా, అమెరికాను బూడిద చేస్తామని హెచ్చరించింది.
మరిన్ని అణుపరీక్షలకు ఉత్తర కొరియా ఆదేశం
Published Sat, Mar 12 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement