జెనీవా: మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఓ కమిటీ శుక్రవారం అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు ‘కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి.
ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ రంగంలో రోబోల వాడకంలో మానవ ప్రమేయం కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీలో ఆయుధ విభాగం చీఫ్ కత్లీన్ లాల్యాండ్ తెలిపారు. ఈ రోబోలు సామూహిక జనహనన ఆయుధాలని విమర్శించారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment