లోపాలను సరిచేసుకునే రోబోలు | Errors Even the robots | Sakshi
Sakshi News home page

లోపాలను సరిచేసుకునే రోబోలు

Published Fri, May 29 2015 6:21 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

లోపాలను  సరిచేసుకునే రోబోలు - Sakshi

లోపాలను సరిచేసుకునే రోబోలు

లండన్: రోబోల అభివృద్ధిలో భాగంగా శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. రోబోల్లో ఏవైనా లోపాలు ఏర్పడితే కేవలం రెండు నిమిషాల్లో ఆ ఇబ్బందులను వాటికవే సరిదిద్దుకునే కొత్త తరం రోబోలను లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆరు కాళ్ల రోబో నడుస్తున్నప్పుడు దాని రెండు కాళ్లు విరిగిపోతే, దానికదే ఎలా సరిచేసుకుంటుందో చూపించే ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎటువంటి సాధనాలను ఏ విధంగా అమర్చాలో రోబో చేతులకు కూడా ఇన్‌పుట్ అందిస్తారు.


‘ఒక కాలు విరిగిన కుక్క మిగిలిన మూడు కాళ్లతో పట్టుదలగా తన పనులు ఏ విధంగా చేసుకుంటుందో మనం చూస్తుంటాం. అలాగే మనకి కూడా కాలికి గాయమై నడవలేని పరిస్థితులో ఉన్నప్పుడు.. ఆ గాయం నుంచి ఎంత తొందరగా బయటపడాలా అని ఆలోచిస్తాం..’ ఇలాంటి సంఘటనలే మా పరిశోధనకు స్ఫూర్తిగా నిలిచాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా స్పందించాలో ఈ రోబోలకు ముందే ప్రోగ్రామ్ చేస్తారు.


సంబంధిత కంప్యూటర్ నుంచి వీటికి ఎప్పటికప్పుడు ఉద్దీపనలు అందుతాయి. వీటి ఆధారంగానే రోబోలు స్పందిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాటికి సమస్యలు ఎదురైనప్పుడు ఇవి శాస్త్రవేత్తలుగా మారిపోతాయని అంటున్నారు. ఈ అధునాతన పరిజ్ఞానం భవిష్యత్తులో రోబోల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement