సహకారాన్ని పెంచుకుందాం!
న్యూయార్క్‌లో మోదీ, నెతన్యాహూ భేటీ
న్యూయార్క్: రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఇజ్రాయెల్‌లు సంకల్పించా యి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆదివారమిక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు సమావేశమయ్యారు. వారు బస చేసిన ప్యాలెస్ హోటల్లో అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, సైబర్ రంగాల్లో సహకారం పెంచుకునే మార్గాలపై, ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ మిలింటెంట్లతో తలెత్తిన పరిస్థితి తదితరాలపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు అని నెతన్యాహూ పేర్కొన్నారు. తన ‘మేక్ ఇన్ ఇండియా’(భారత్‌లో తయారీ) కార్యక్రమం వివరించిన మోదీ.. తమ దేశ రక్షణ రంగంలో విదేశాలు 49 శాతం పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపారు.
ఐటీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో ఇజ్రాయెల్ నైపుణ్యాలను తమతో పంచుకోవాలని మోదీ సూచించగా, అందుకు సహకరిస్తామని నెతన్యాహూ చెప్పారు. త్వరలో తమ దేశంలో పర్యటించాలని నెతన్యాహూ మోదీని కోరారు. తమ దేశంలో యూదు మతస్తులపై ఎలాంటి వివక్షా లేదని, వారు తమ సమాజంలో అంతర్భాగమని మోదీ చెప్పారు. ముంబై విశ్వవిద్యాలయంలో హిబ్రూ భాషను బోధిస్తున్నారని, గతంలో ముంైబె కి ఒక యూదు మేయర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. గత పదేళల్లో ఇరు దేశాల ప్రధానులు భేటీ కావడం ఇదే తొలిసారి.