srael
-
ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు -
సహకారాన్ని పెంచుకుందాం!
న్యూయార్క్‌లో మోదీ, నెతన్యాహూ భేటీ న్యూయార్క్: రక్షణ, వాణిజ్యం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఇజ్రాయెల్‌లు సంకల్పించా యి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆదివారమిక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు సమావేశమయ్యారు. వారు బస చేసిన ప్యాలెస్ హోటల్లో అరగంట పాటు కొనసాగిన ఈ భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, సైబర్ రంగాల్లో సహకారం పెంచుకునే మార్గాలపై, ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ మిలింటెంట్లతో తలెత్తిన పరిస్థితి తదితరాలపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు అని నెతన్యాహూ పేర్కొన్నారు. తన ‘మేక్ ఇన్ ఇండియా’(భారత్‌లో తయారీ) కార్యక్రమం వివరించిన మోదీ.. తమ దేశ రక్షణ రంగంలో విదేశాలు 49 శాతం పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపారు. ఐటీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో ఇజ్రాయెల్ నైపుణ్యాలను తమతో పంచుకోవాలని మోదీ సూచించగా, అందుకు సహకరిస్తామని నెతన్యాహూ చెప్పారు. త్వరలో తమ దేశంలో పర్యటించాలని నెతన్యాహూ మోదీని కోరారు. తమ దేశంలో యూదు మతస్తులపై ఎలాంటి వివక్షా లేదని, వారు తమ సమాజంలో అంతర్భాగమని మోదీ చెప్పారు. ముంబై విశ్వవిద్యాలయంలో హిబ్రూ భాషను బోధిస్తున్నారని, గతంలో ముంైబె కి ఒక యూదు మేయర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. గత పదేళల్లో ఇరు దేశాల ప్రధానులు భేటీ కావడం ఇదే తొలిసారి.