అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రకటించడం భారతీయులకు గర్వకారణం. ప్రత్యే కించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొని యోగాపై చేసిన ప్రతిపాదనను సమితి గుర్తించింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రక్రియ వహిస్తున్న సానుకూల పాత్ర భారతదేశం సరిహద్దులు దాటి అంతర్జాతీయ సమాజానికి ఎంతో కాలం క్రితమే పరిచయమైంది.
యోగా గురించి భారత్ బయటనున్న ప్రపంచానికి స్వామి వివేకానంద పరిచయ వాక్యాలు పలుకగా ప్రముఖ యోగా గురు అయ్యంగార్ వంటి మహామహుల కృషితో యోగా ఆచరణ నేడు విశ్వవ్యాప్తమైంది. చిన్న చిన్న రోగాలకి కూడా పాశ్చాత్య వైద్యవిధానాలే దిక్కుగా మారడమే కాకుండా, స్వదేశీ వైద్యవిధానాలని చిన్నచూపు చూసే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఎప్పటినుంచో నెలకొంది. ఈ నేపథ్యంలో యోగా ఆరోగ్యకరమైన జీవనశైలిని మనిషికి పరిచయం చేస్తుంది. ప్రకృతి సహజ సూత్రాల్ని గౌరవించడం నేర్పుతుంది. శారీ రక, మానసిక ఆరోగ్యానికి దోహదపడే ఈ ప్రక్రియ విశిష్టతను విలు వను ఐక్యరాజ్య సమితి నేటికి గుర్తించడం ముదావహం. అందుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు.
- డా. డి.వి.జి. శంకరరావు
మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా
మన యోగా అంతర్జాతీయం
Published Sat, Dec 13 2014 1:23 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement