న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారీస్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు రూపమన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్ రిచర్డ్ గేర్ భారత ప్రధానితో కొద్దిసేపు మాటామంతీ జరిపిన తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను ఓ మీడియా ప్రతినిధి కార్యక్రమం గురించి స్పందించమని కోరగా.. "ఇదొక ప్రేమ పూర్వకమైన సందేశమని.. ఆయన అసలైన సంస్కృతికి పుట్టినిల్లయిన భారత్ నుండి వచ్చారు. ఆయన భారతీయ సాంప్రదాయానికి ప్రతిబింబం. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని పెంచే విధంగా ఉన్న ఆయన సందేశం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అన్నారు.
#WATCH | It is a lovely message. He (PM Modi) is a product of Indian culture and comes from a vast place like Indian culture does. This message of universal brotherhood and sisterhood is the one we want to hear again and again, says Richard Gere after Yoga Day event in New York pic.twitter.com/9fKXLpCYyh
— ANI (@ANI) June 21, 2023
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ తో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ "వసుదైక కుటుంబం" పేరుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రతినిధులంతా ఒకేచోట చేరి కుటుంబ వేడుకను తలపించారు.
ఇది కూడా చదవండి: ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం..
Comments
Please login to add a commentAdd a comment