Fund Accounts
-
ఫండ్ బిజినెస్‌లోకి ఫెడరల్ బ్యాంక్!
కోల్‌కతా: ఈ మధ్యనే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫెడరల్ బ్యాంక్ తాజాగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. తన పూర్తి అనుబంధ ఎన్బీఎఫ్సీ విభాగం ‘ఫెడ్‌ఫినా’లో 26 శాతం వాటాను వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించి సబ్సిడరీ ఏర్పాటు కోసం నిధులను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమయింది. ఇద్దరు బిడ్డర్లతో చర్చలు జరుగుతున్నాయని, ఆర్థిక సంవత్సరం చివరికల్లా వ్యూహాత్మక ఇన్వెస్టర్ ఎవరనేది ఖరారు కావొచ్చని బ్యాంక్ తెలిపింది. ‘మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించాం. రిటైల్, లార్జ్ టికెట్ హోమ్ లోన్స్లోని పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లకు చూస్తున్నాం’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ తిరిగి ఎన్నిక
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు మరో కీలక విజయం. 47 దేశాలతో కూడిన ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్చార్సీ)కి మనదేశం తిరిగి ఎన్నికైంది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి అత్యధికంగా 162 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికతో యూఎన్‌హెచ్చార్సీలో భారత్‌కు 2015-17 వరకు సభ్యత్వం ఉంటుంది. ఈ సంస్థలో భారత్ తొలి, ప్రస్తుత సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగుస్తుంది. విదేశీయులకు పీఎఫ్ వారి దేశాల్లోనే చెల్లింపు న్యూఢిల్లీ: భారత్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వారి భవిష్యనిధి ఖాతాల డబ్బును వారి సొంత దేశాల్లోనే చెల్లించే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. దీంతో వారు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించుకోవడానికి భారత్‌లో గతంలో మాదిరి బ్యాంక్ ఖాతాలను తె రవాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ఓ అధికారి చెప్పారు. విదేశీ ఉద్యోగులకు వారి దేశాల్లో చెలింపుల కోసం పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ బ్యాంకులో 3 ఖాతాలను ప్రభుత్వం తెరిచింది.ట