
కోల్‌కతా: ఈ మధ్యనే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫెడరల్ బ్యాంక్ తాజాగా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. తన పూర్తి అనుబంధ ఎన్‌బీఎఫ్‌సీ విభాగం ‘ఫెడ్‌ఫినా’లో 26 శాతం వాటాను వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించి సబ్సిడరీ ఏర్పాటు కోసం నిధులను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమయింది.
ఇద్దరు బిడ్డర్లతో చర్చలు జరుగుతున్నాయని, ఆర్థిక సంవత్సరం చివరికల్లా వ్యూహాత్మక ఇన్వెస్టర్ ఎవరనేది ఖరారు కావొచ్చని బ్యాంక్ తెలిపింది. ‘మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించాం. రిటైల్, లార్జ్ టికెట్ హోమ్ లోన్స్‌లోని పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లకు చూస్తున్నాం’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment