ఏడాదిన్నరలో ఫెడరల్ బ్యాంక్ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్యను 100 పైచిలుకు స్థాయికి పెంచుకోనున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాలను పూర్తి స్థాయి జోన్‌గా మార్చే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సంఖ్య 78గా ఉందని చెప్పారు.
హైదరాబాద్‌లో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ లోన్‌బుక్ 10,500 కోట్ల స్థాయిలో ఉందని, రిటైల్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నామని శ్రీనివాసన్ వివరించారు. ప్రత్యేక ప్రాంతీయ క్రెడిట్ హబ్ ద్వారా గ్రామీణ, వ్యవసాయ రంగాల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నట్లు తెలిపారు. నలభై అయిదేళ్ల వ్యవధిలో సాధించిన వ్యాపారాన్ని గత అయిదేళ్లలో రెట్టింపు చేసుకున్నామని శ్రీనివాసన్ చెప్పారు. ఇక్కడి నుంచి మూడేళ్లలోనే రెట్టింపు వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1,600 శాఖలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment