
తిరువొత్తియూర్(తమిళనాడు): దిండుక్కల్ జిల్లాలో వృద్ధ దంపతులు విషం తాగి.. ఆత్మహత్య చేసుకున్నారు. వీరు తమ అంత్యక్రియలు ముందస్తుగా డబ్బుఇవ్వడం గమనార్హం. వివరాలు.. దిండిగల్ జిల్లా వత్తలగుండు సమీపం కనవాయ్‌పట్టికి చెందిన తోత్తన్ (65). అతని భార్య వీరాయి (60). వీరికి పిల్లలు లేరు. తొత్తన్ కాఫీ తోటల్లో కూలి కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరాయి 100 రోజుల పనులకు వెళుతూ ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా వీరు పనులకు వెళ్లలేక ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. దీంతో విరక్తి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు.
గన్నేరు కాయలు నూరి తాగేసి వాంతులు చేసుకున్నారు. ఈ విషయాన్ని పక్కంటిలో నివాసం ఉండే అంథోని గమనించారు. దీంతో వారు తాము విషం తాగామని, కాపాడడానికి ప్రయత్నం చేయవద్దని, తమ మృతదేహలను ఒకేచోట పాతి పెట్టాలని, అంత్యక్రియల ఖర్చులకు రూ. 40,000 నగదును అంథోనికి చేతికిచ్చారు. తర్వాత కొద్ది సేపటికే వీరాయి, తోత్తన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment