గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో దారుణం జరిగింది. గ్రామంలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులను దోపిడీ దొంగలు హతమార్చారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో దారుణం జరిగింది. గ్రామంలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులను దోపిడీ దొంగలు హతమార్చారు. ఆ ఇంట్లో ఉన్న సొమ్మును, రికార్డులు, నగలను కూడా దోచుకెళ్లారు. అయితే కేవలం దోపిడీకి మాత్రమే వచ్చిన దొంగలైతే వీరిని చంపాల్సిన అవసరం ఉండేది కాదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ భార్యాభర్తలకు పిల్లల్లేరు. దంపతులిద్దరే ఊళ్లో ఉంటారు. ఎనిమిది ఎకరాల పొలం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇలాంటివాళ్లను చంపారంటే ఆస్తికోసమేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. డీఎస్పీతో పాటు స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏ కోణంలో ఈ సంఘటన జరిగిందో విచారిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను కూడా రప్పిస్తున్నారు. నేరం ఏ కోణంలో జరిగిందో తెలిసిన తర్వాతే నిందితుల కోసం గాలింపు మొదలుపెడతామని పోలీసులు అంటున్నారు.