నగదు, నగల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
నాగులుప్పలపాడు(ప్రకాశం): నగదు, నగల కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని పోతవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఊటుకూరి సూర్యనారాయణ (68), ఆయన భార్య విజయలక్ష్మి (60) గ్రామంలోనే కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకున్న దంపతులు ఇంటికి ముందుభాగంలో ఉన్న తలుపునకు గడియపెట్టి నిద్రపోయారు. అనంతరం ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నాగులుప్పలపాడు ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.15 వేలు సూర్యనారాయణరావు డ్రా చేశాడు. బ్యాంకు నుంచి లక్షల్లో డ్రా చేసి ఉంటాడన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి దుండగులు పాల్పడి ఉంటారేమోనని పోలీసులు భావిస్తున్నారు.