కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. | Elderly Couple Died In East Godavari | Sakshi
Sakshi News home page

కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం..

Published Mon, Apr 26 2021 11:15 AM | Last Updated on Mon, Apr 26 2021 11:32 AM

Elderly Couple Died In East Godavari - Sakshi

కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడలో వృద్ధ దంపతులు 24 గంటల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు వదిలిన విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, ఆదివారం భర్త ప్రాణాలు విడిచారు. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. చేనేత వస్త్ర వ్యాపారం చేసే 85 సంవత్సరాల అతని మనుమడికి కరోనా సోకింది. అతడు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు.

ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ వృద్ధుల మృతదేహాలను చూసేందుకు ఎవరూ సాహసించలేదు. కనీసం శ్మశానానికి తరలించేందుకు బంధువులు కూడా ముందుకు రాకపోవడంతో వారి కుమారుడే రిక్షాలో తల్లిదండ్రుల శ్మశానానికి తరలించి, అంత్యక్రియలు చేశారు. రిక్షాలో మృతదేహాలను తరలించిన హృదయ విదారక దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు.

చదవండి: జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం..    
ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement