
నెక్కొండ: జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడే టీకా కూడా వేయించుకున్నారు. అదే రోజు భార్య మృతి చెందగా, ఐదో రోజు భర్త మరణించాడు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెక్కొండకు చెందిన పుట్టపాక అంజమ్మ (58), వెంకటయ్య (67) దంపతులు ఈనెల 19న స్థానిక పీహెచ్‌సీకి కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్లారు. అదే సెంటర్‌లో కరోనా టీకా సైతం తీసుకున్నారు. కాగా, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అంజమ్మ మృతి చెందింది.
అప్పటినుంచి జ్వరంతో బాధపడుతూ, మనోవేదనకు గురైన భర్త వెంకటయ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. టీకా కోసం వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ వేయడంతోనే వృద్ధ దంపతులు మృతిచెందారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్‌ను వివరణ కోరగా, వృద్ధాప్యంలో వచ్చే హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెంది ఉండవచ్చనని అభిప్రాయపడ్డారు.
చదవండి: విషాదం.. దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే
Comments
Please login to add a commentAdd a comment