![Old Couple To Get Married Soon Blessings Of Families Mysore - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/9/7.jpg.webp?itok=neEW5YYE)
మైసూరు: జీవితం చరమాంకంలో తోడు కావాలని భావించారు. వయసు శరీరానికే కాని మనసు కాదని ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో 73 ఏళ్ల
వృద్ధురాలిని 69 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకోబోతున్నారు. వివరాలు... మైసూరు నగరంలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డు ఉపాధ్యాయురాలు, కొన్నేళ్ల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒంటరి తనంతో ఉన్నఆమెకు తోడు అవసరమని కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించారు.
దీంతో వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే పెళ్లికి అంగీకరించాడు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
చదవండి: పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం..
Comments
Please login to add a commentAdd a comment